ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ మరో ఘనత
- August 16, 2017
ప్రపంచంలోనే నివసించడానికి అత్యంత యోగ్యమైన నగరంగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఎంపికైంది. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) తాజాగా నిర్వహించిన ప్రపంచ నివాసయోగ్య నగరాల సర్వేలో ఈ విషయం వెల్లడైంది. వియన్నా, వాంకోవర్ నగరాలను వెనక్కునెట్టి అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాకే చెందిన సిడ్నీ నగరం టాప్ 10 నుంచి కిందకు పడిపోయింది. చిన్న నగరాలైన అడిలైడ్, పెర్త్ టాప్ 10లో చోటు దక్కించుకోవడం విశేషం.
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 140 నగరాలపై స్థిరత్వం, ఆరోగ్య సేవలు, సంస్కృతి, పర్యావరణం, విద్య, మౌలిక వసతులు తదితర 30 అంశాలను ఆధారంగా చేసుకుని ఈఐయూ ఈ సర్వే చేసింది. మొదటి లేదా చివరి పది సిటీల్లో ఏ భారత నగరానికీ చోటు దక్కలేదు. ఆస్ట్రియా రాజధాని వియన్నా, కెనడాలోని వాంకోవర్, టొరంటో, కల్గరీ వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







