ఎరవాడ జైల్లో సాంగ్ లాంచ్ చేసిన లక్నో సెంట్రల్ యూనిట్
- August 16, 2017
ఎరవాడ జైల్లో సాంగ్ లాంచ్
నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మరో బాలీవుడ్ మూవీ లక్నో సెంట్రల్. ఫర్హాన్ అక్తర్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాకు రంజిత్ తివారీ దర్శకుడు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాన్ని విభిన్నంగా నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ పాటను ఎరవాడ జైల్లో రిలీజ్ చేశారు.
తీన్ కబూతర్ అంటూ సాగే ఈ పాటకు చిత్రయూనిట్ పాటు జైల్ లోని 300 మంది ఖైదీలు కూడా డ్యాన్స్ చేయటం విశేషం. అంతేకాదు సినిమాను కూడా జైల్లో ప్రదర్శించేందుకు అనుమతి కోరినట్టుగా నటుడు ఫర్హాన్ అక్తర్ వెల్లడించారు. ఇప్పటికే ఎరవాడ అదనపు డీజీపీ భూషణ్ కుమార్ తో ఈ విషయం పై చర్చించామని, ఆయన ఉన్నతాధికారులతో ఈ విషయాన్ని చరిస్తామన్నారని తెలిపారు. లక్నో సెంట్రల్ సినిమాను సెప్టెంబర్ 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







