హజ్ యాత్రలో భాగంగా సౌదీ అరేబియాకు చేరుకొన్న104 ఏళ్ల బామ్మగారు
- August 17, 2017
సౌదీ అరేబియా : అరవై ఏళ్ళు వయస్సుకే..అప్పగింతలు పెట్టే అమ్మమ్మలు అడుగడుగునా ఉన్న ఈ కాలంలో ఇండోనేషియా నుండి ఏకంగా 104 ఏళ్ల బామ్మగారు హజ్ యాత్రకు చెంగు చెంగున ప్రయాణమై జెడ్డాకు చేరుకొన్నారు. ఈ సంవత్సరం ఇండోనేషియా నుంచి వచ్చిన 220,000 హజ్ యాత్రికుల్లో అందరికన్నా పెద్ద వయస్సు ఉన్న బాయిక్ మారియా అనే వృద్ధురాలు కావడం విశేషం. జెడ్డా లోని ఇండోనేషియా రాయబార కార్యాలయ కాన్సుల్ జనరల్ మొహమ్మద్ హెరి సరిపుద్దిన్ మాట్లాడుతూ, బాయిక్ మరియా మంచి ఆరోగ్యంతో ఉందని మరియు హజ్ ఆచారాలను ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తి చేయగలనని ఆమె సంతోషంగా తెలిపిందన్నారు..ఆమె ఇండోనేషియా నుండి వచ్చేటప్పుడు ఆమెకు తోడుగా ప్రత్యేక సహాయం అందించారు. కొందరు అధికారులు ఆమె సురక్షితమైన మరియు మృదువైన విమాన ప్రయాణం జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నారు. అలాగే ఆమె కోసం సౌదీ అరేబియాలో స్థానిక అధికారులచే ప్రత్యేక సహాయంతో మరియాకు అందించారు. ఇండోనేషియాలో హజ్ ను నిర్వహించడానికి లక్షలాదిమంది ముస్లింలు ఎదురుచూసేరని మొహమ్మద్ హెరి సరిపుద్దిన్ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







