యాక్సిడెంట్లతో దుబాయ్లో ట్రాఫిక్ సమస్యలు
- August 17, 2017
దుబాయ్: రెండు మేజర్ యాక్సిడెంట్స్ కారణంగా దుబాయ్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఇతర చిన్న ప్రమాదాలూ ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమయ్యాయి. ఓ వాహనం షేక్ జాయెద్ రోడ్డుపై ప్రమాదానికి గురయ్యింది. అబుదాబీ వైపుగా వెళ్ళే ఏడవ బ్రిడ్జి, ఎనిమిదవ బ్రిడ్జ్ మధ్య ఈ ప్రమాదం కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. సోషల్ మీడియా ద్వారా దుబాయ్ పోలీసులు ట్రాఫిక్ సమస్యలపై వాహనదారుల్ని అప్రమత్తం చేశారు. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై చోటు చేసుకున్న ప్రమాదంతో షార్జా వైపుగా ఫస్ట్ బ్రిడ్జిపై తీవ్రమైన ట్రాఫిక్ సమస్య తలెత్తింది. బిజినెస్ బే ఏరియా, ఎగ్జిక్యూటివ్ టవర్స్, డౌన్టౌన్ దుబాయ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ సమస్యలు తప్ప ప్రమాదాల కారణంగా ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని, ఎవరికీ ప్రాణాపాయం సంభవించలేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







