మొదటి కతర్ యాత్రికుల బృందం సౌదీ అరేబియాలో ప్రవేశం
- August 17, 2017
మంచి సందర్భాలు..మనస్సులను ఒకటి చేస్తాయి. వివిధ దేశాల మధ్య స్నేహ సంబంధాలను బలోపేతం చేస్తాయి.100 మందితో కూడిన ఒక ఖతార యాత్రికుల మొదటి బృందం సాల్వా సరిహద్దు ని దాటి సౌదీ అరేబియాలో ప్రవేశిందగా సౌదీ అధికారులు వారిని స్వాగతించారు. హజ్ అనుమతి లేకుండా ఈ యాత్రికులను అనుమతించారు. వారిని కింగ్ సల్మాన్ అతిథులుగా వ్యవహరించి అన్ని ఖర్చులు భరిస్తారు. డమ్మామ్ మరియు అల్-అహ్సా విమానాశ్రయాల నుండి సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ ద్వారా పవిత్ర నగరాలకు వారినందరిని ఉచితంగా రవాణా చేయాలని రాజు సూచించారు. సల్వా సరిహద్దు వద్ద పాస్పోర్ట్ డైరెక్టర్ హస్సన్ అల్-దోసరి " మా గల్ఫ్ డాట్ కామ్ " ప్రతినిధితో మాట్లాడుతూ, మేము అల్లాహ్ అతిథులకు (యాత్రికులు) గౌరవించడం వారికి సేవ చేయడం ఒక భాగ్యంగా భావిస్తాం. హజ్ చేయటానికి సౌదీ అరేబియా లోకి ప్రవేశించేలా చొరవ తీసుకొన్న రాజు సల్మాన్ తీసుకున్న నిర్ణయంతో పూర్తిగా ఏకీభవిస్తాం " అల్-దోసారి యాత్రికుల లాంజ్లో పాస్పోర్ట్ సిబ్బంది ఉన్నారని వారు 24 గంటల పాటు యాత్రికులకు సేవలను అందించడం వారి కోసం పాస్పోర్ట్ సంబంధిత విషయాలు సులభతరం చేయడం కోసం సన్నాహాలు సిద్ధం చేసేమని చెప్పేందుకు మేము ఎంతో గర్వపడుతున్నామని ఆయన అన్నారు. కతర్ హాజ్ యాత్రికులకు ఉత్తమ సేవలను అందించేలా చర్యలు తీసుకోవాలని డమ్మామ్ మరియు అల్- సహస విమానాశ్రయాలు డైరెక్టర్లకు పౌర విమానయాన సంస్థ జనరల్ అథారిటీ అధ్యక్షుడు అబ్దుల్ హకీమ్ అల్- తమిమి సూచించారు. ఖతార యాత్రికుల మొదటి బృందంకు బాధ్యత వహిస్తున్నసమీర్ హఫీజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ,50 మంది కతర్ యాత్రికులు మరియు అధికారులతో సహా మక్కాలో శిబిరాల సన్నాహాలు పర్యవేక్షించటానికి వచ్చాయి. ఈ ఏడాది 2,400 మంది ఖతారీ యాత్రికులు సౌదీ అరేబియా రానున్నట్లు ఆయన చెప్పారు.గురువారం కతర్ శిబిరాలు సంసిద్ధతను ప్రదర్శించేందుకు అన్ని మీడియా సంస్థలు తెరిచి ఉన్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







