పైసా వసూల్ ఆడియో వేడుక లో అదరకొట్టిన బాలయ్య స్పీచ్

- August 18, 2017 , by Maagulf
పైసా వసూల్ ఆడియో వేడుక లో అదరకొట్టిన బాలయ్య స్పీచ్

తాజాగా జరిగిన పైసా వసూల్ ఆడియో వేడుక లో బాలయ్య స్పీచ్ అద్భుతంగా సాగింది. అభిమానులకి ఫుల్ జోష్ ఇస్తున్న బాలయ్యబాబు మద్యం పైన చాలా ఫేమస్ అయిన ఒక దండకం స్వయంగా తానే చదివి వినిపించారు అందరికీ. "ఓ బ్రాందీ, ఓ విస్కీ, ఓ రమ్ము ఎంతో రుచిరా... ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా...  పాల మీగడలకన్నా, పంచదార చిలకలకన్నా, ఓ సారా నీ నామ మెంతో రుచిరా...
ఓ సారా దేవా... నీవు బీరువై, బ్రాందివై, విస్కీవై, రమ్మువై, జిన్నువై, కాక్ టేలువై, గుడుంబావై, నాటు సారావై, డైలీ దేవుండవై, సంపూర్ణ మత్తు సిద్ధివై, రసస్ఫూర్తివై, రసాధి దేవతవై..." అలా వెళ్ళింది ఈ దండకం.  బాలయ్య నోట్లోంచి ఇలాంటి దండకం రావడం తో ఫాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు.
"ఆల్కహాలువై, ఈతకల్లువై, తాటికల్లువై, ద్రాక్షసారావివై, మందు నామాంతరమ్మువై, ప్రత్యక్ష దైవంబువై వచ్చి, మా నాల్కపై నిలిచి, మా గొంతులో జారి, ఉదరమ్ములో కొలువుండి, ఆఖలి బాధలు తప్పించి, ఈతి బాధలు మరిపించి, తారతమ్యాలు లేవనుచు మాకు బ్రహ్మానందమ్ము ప్రసాదించుము. ఓ దేవా, ఓ సారా దేవా... నమస్తే నమస్తే నమః" అంటూ బాలయ్య పాడుతూ ఉంటె అభిమానులు కేరింతలు కొట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com