వయాగ్రా ఓవర్‌డోస్‌: దుబాయ్‌ టూరిస్ట్‌ మృతి

- August 18, 2017 , by Maagulf
వయాగ్రా ఓవర్‌డోస్‌: దుబాయ్‌ టూరిస్ట్‌ మృతి

ఆఫ్రికాకి చెందిన ఓ వ్యక్తి బయాగ్రాని అధిక మోతాదులో తీసుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని దుబాయ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూసన్‌ ధృవీకరించింది. కామెరాన్‌ జాతీయుడు, దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ఇటీవల మృతి చెందిన విషయం తాజాగా వెలుగు చూసింది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి వెళ్ళి చూడగా 52 ఏళ్ళ వ్యక్తి బాత్రూమ్‌లో విగతజీవిగా పడి ఉన్నాడు. ఫోరెన్సిక్‌ వైద్యులు, అతని శరీరాన్ని పరీక్షించి అతనిపై దాడి జరిగిందా? అన్న కోణంలో విచారణ జరిపారు. విచారణలో 52 ఏళ్ళ వ్యక్తి 23 ఏళ్ళ మహిళతో సంబంధం కలిగి ఉన్నాడని తేలింది. ఆమె కూడా కామెరూన్‌ జాతీయురాలే. గత ఏడు నెలలుగా ఆ వ్యక్తితో తనకు సంబంధం ఉందనీ, నాలుగు గంటలపాటు ఇద్దరం శారీరక సెక్స్‌ని ఎంజాయ్‌ చేశామనీ, అయితే బ్యాగ్‌లోంచి ఏదో మెడిసిన్‌ తీసుకుని ఆ వ్యక్తి వేసుకోవడం తాను గమనించానని ఆమె వివరించింది. పోలీసులు ఆ మెడిసిన్స్‌ని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కి పంపగా, విచారణలో అది వయాగ్రా అని తేలింది. వయాగ్రా ఓవర్‌డోస్‌తోనే 52 ఏళ్ళ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com