యూట్యూబ్ లో తమిళ హీరో విజయ్ సినిమా రికార్డు
- August 18, 2017
తమిళ స్టార్ హీరోగా చలామణి అవుతున్న విజయ్ మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. విజయ్ , సమంత జంటగా అట్లీ దర్శకత్వం లో 2016 లో విడుదలైన తెరి చిత్రం ఎలాంటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలుసు. ఇప్పుడు ఈ మూవీ మరో రికార్డు ను సాధించింది.
ఈ చిత్ర హిందీ డబ్బింగ్ వెర్షన్ ను జులై 1న యూట్యూబ్‌లో విడుదల చేసారు. కాగా ఈ మూవీ ఇప్పటి వరకు (ఆగస్టు 18) మొత్తం 26 మిలియన్ల (2.6 కోట్లు) మంది హిందీ వెర్షన్‌ను వీక్షించారు. దీంతో హిందీలో డబ్బింగ్ అయ్యి యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన తొలి తమిళ చిత్రంగా 'తెరి' రికార్డు సాధించింది. దీంతో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న చిత్రం 'మెర్సల్'. ఈ సినిమా ఆడియోను ఆగస్టు 20న విడుదల చేస్తున్నారు. అక్టోబరు 18న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







