'పైసా వసూల్' సినిమాపై నిర్మాతల్లో గుబులు
- August 19, 2017
ఆయనకసలే ఊరమాస్ డైరెక్టర్ అని ఇంకో పేరు. పైగా.. బాలయ్య ఎనర్జీ యాడయ్యింది.. ఇంకేముంది.. 'పైసా వసూల్' మసాలా నషాళానికంటేసింది. బాలకృష్ణ ఫ్యాన్స్ కి పిచ్చపిచ్చగా నచ్చేసిన 'పైసా వసూల్' ట్రైలర్.. కొన్ని కార్నర్స్ ని మాత్రం తెగ ఏడిపిస్తోంది. నిర్మాతల సంగతేమో గాని.. పంపిణీదారుల్లో ఇప్పట్నుంచే గుబులు మొదలైపోయింది. ఇలా అయితే పైసా ఎలా వసూలవుతుందంటూ డైరెక్ట్ క్వశ్చన్లే పడిపోతున్నాయి.
భవ్య క్రియేషన్స్..! పేరుకు కొత్త బ్యానరే అయినా అనతికాలంలోనే గొప్ప ప్రతిష్టను కూడగట్టుకుంది. తీసింది చిన్నసినిమాలే.. కలెక్షన్లతో ప్రమేయం లేకుండా విభిన్నతను చాటుకున్న ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు వెనిగళ్ల ఆనంద ప్రసాద్. ఒక్కసారిగా మెయిన్ స్ట్రీమ్ డైరెక్టర్ పూరితో కాంట్రాక్టు కుదుర్చుకుని బాలయ్యను హీరోగా పెట్టుకొనేసరికి.. ఆయన 'పైసా వసూల్' మీద అంచనాలు ఆకాశాన్నంటేశాయి. టీజర్, స్టంపర్లతో ఆ రేంజిని ఇంకాస్త పెంచుకున్నారు. అయితే.. ట్రైలర్ వచ్చేసరికి.. తేడా కొట్టేసింది.
ఇవ్వాల్టిరోజుల్లో అన్ని సెక్షన్స్ నీ తృప్తిపరిస్తే తప్ప ఏ సినిమా కూడా ఆడని పరిస్థితి. కానీ.. 'పైసా వసూల్' ప్రోడక్ట్ ఒక్క మాస్ ఆడియెన్స్ ని తప్పితే మరెవరికీ తాకే అవకాశాలు లేవన్నది సినిమా పండితుల మాట. వసూళ్ల దగ్గర ఈ ఎలిమెంట్ తేడా కొట్టడం ఖాయమంటూ.. కొనుగోలుదారులు తేల్చేస్తున్నారు. ట్రైలర్లో టన్నుల కొద్దీ ఎనర్జీ ఉన్నప్పటికీ.. దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేసే సెక్షన్ మాత్రం చాలా పరిమితమైందని, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ విముఖత చూపే అవకాశముందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి.
సినిమా మీద కోటి పెడితే 90 లక్షలు మనవి కావనుకోవాల్సిందేనన్నది కొంతమంది కమిట్మెంట్. కానీ, సినిమాను కొనడానికి రెగ్యులర్ బయ్యర్స్ రెడీగా వున్నారు కనుక ప్రీ-రిలీజ్ బిజినెస్ కి ఢోకా లేకపోవచ్చు. నిర్మాతలు సైతం.. 'పైసా వసూల్' నుంచి పెద్దగా వెనకేసుకుందామన్న నమ్మకాల్ని ఎప్పుడూ పెట్టుకోలేదు. ఆడియో, శాటిలైట్ రైట్స్ కలిపి పది కోట్లు చేతికొచ్చినా, థియేట్రికల్ రైట్స్ విషయంలో ముందునుంచీ తడబడుతూనే వుంది 'పైసా వసూల్' మూవీ. 40 కోట్ల బడ్జెట్ తో తీశాం.. క్రేజీ కాంబో కనుక కనీసం 50 కోట్లయినా బిజినెస్ చేయకపోదా అని ఆశలుపెట్టుకున్నారు. కానీ.. 35 కోట్లకు అటూఇటూ మాత్రమే బిజినెస్ అయినట్లు తెలుస్తోంది. ఆ పెట్టిన పైసలకన్నా గ్యారంటీ ఉందా అంటూ ఇప్పుడు మళ్ళీ లెక్కలేసుకుంటున్నారు బయ్యర్లు.
శాతకర్ణితో 50 కోట్ల క్లబ్ లో చేరిన బాలయ్య, ఆ తర్వాత రాబోయే ఈ 'పైసా వసూల్'తో ప్రమోట్ అవుతారా, డిమోట్ అవుతారా అనేది అటుంచితే.. పంపిణీదారుల గుండెల్లో మాత్రం గులకరాళ్లు పడ్డట్టయింది ఈ తేడా ట్రైలర్ తో. యూట్యూబ్ హిట్స్ ని లెక్కలేసుకుని అందులో వచ్చే లైకుల్ని, కామెంట్లను ఎంజాయ్ చేస్తున్న భవ్య క్రియేషన్స్.. ఈ జోష్ ని మూవీ రిలీజ్ (సెప్టెంబర్ 1) తర్వాత కూడా కంటిన్యూ చేసుకుంటుందా? లేదా అనేది సస్పెన్స్!
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









