తల తెగిపడి ముందు నేరస్థుడ్ని క్షమించిన బాధితుని తండ్రీ
- August 19, 2017
రియాద్: కన్న కొడుకుని కిరాతకంగా చంపిన హంతకుడిని క్షమించి శిరిచ్ఛేదనం శిక్ష నుంచి తప్పించిన ఆ తండ్రి అందరి అభిమానం చురగొన్నాడు. సౌదీ అరేబియాలోని ఖమిస్ ముషీత్ ప్రావిన్స్‌లోని అసీర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన కొడుకుని చంపిన వ్యక్తికి ప్రాణభిక్ష పెట్టాడు. తన కొడుకుని చంపిన వ్యక్తికి చట్టప్రకారం శిరచ్ఛేదం చేయబోతుండగా కేవలం నిమిషాల ముందు అడ్డుకున్నాడు. కొంతమందితో ఉరి తీసే ప్రాంతానికి వచ్చిన ఆ వ్యక్తి.. ‘నిందితుడిని క్షమిస్తున్నాను. తల నరకకండి .. వదిలేయండి’ అని కోరాడు. దీంతో నిందితుడిని క్షమాభిక్ష కింద వదిలేశారు. నిందితుడు రెండేళ్ల జైలుశిక్ష అనుభవించిన అనంతరం ఉరిశిక్ష విధించాలని నిర్ణయించారు. శిక్ష అమలుచేయడానికి నిమిషాల ముందు క్షమిస్తున్నానని ప్రకటించి ఓ మనిషి ప్రాణాలు నిలవడానికి కారణం అయినందుకు పెద్దాయనను అందరూ పొగిడారు. అక్కడున్న వారైతే భూజాలపై ఎక్కించుకుని జైజేలు పలికారు. కొడుకుని హత్య చేసిన వ్యక్తిని క్షమించావని ప్రశంసించారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







