ఉత్తరప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం
- August 19, 2017
లక్నో : ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ ఖతౌలి వద్ద కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో ఇప్పటివరకూ 23 మంది మరణించారు. పెద్దసంఖ్యలో ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ప్రమాదంపై రైల్వే మంత్రి సురేష్ ప్రభు విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన లోపాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు. శనివారం సాయంత్రం 5.50 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనా స్థలానికి మెడికల్ వ్యాన్స్, వైద్య సిబ్బంది చేరుకున్నాయని చెప్పారు.
సహాయ కార్యక్రమాలపై తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, సహాయ చర్యలను వేగవంతం చేయాలని రైల్వే బోర్డు ఛైర్మన్‌ను ఆదేశించామన్నారు. ఘటనా స్థలానికి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకుని సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటివరకూ 50 మంది ప్రయాణీకులను కాపాడినట్టు అధికారులు తెలిపారు. ఒడిశాలోని పూరి నుంచి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు ట్రైన్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, మృతుల కుటుంబాలకు రూ.3.5 లక్షలు, తీవ్రగాయాలైన వారికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియాగా రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రకటించారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







