దసరా బరిలో బుల్లితెర మెగాస్టార్
- August 19, 2017
బుల్లితెర మెగాస్టార్ గా ఓ రేంజ్ లో పాపులరైన ప్రభాకర్.. వెండి తెరపై చిన్న చిన్న పాత్రల్లో అప్పుడప్పుడు కనిపిస్తుండేవాడు.. ప్రభాకర్ నటుడు, నిర్మాత, కధా రచయిత, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మల్టీ టాలెంటెడ్ పర్సన్. కాగా వెండి తెరపై మెగా ఫోన్ పట్టి దర్శకుడి గా తన సత్తా చాటాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.. ఈ నేపద్యంలో ప్రభాకర్ గీతా ఆర్ట్స్, యువీ క్రియెషన్స్ స్టూడియో గ్రీన్ కలయిక లో బన్నీ వాసు నిర్మాణ సారధ్యంలో ఏర్పాటైన 'వీ4 క్రియెషన్స్ బ్యానర్' లో దర్శకుడి గా సినిమా చేసే అవకాశం దక్కించుకొన్నాడు. ఆది సాయికుమార్ హీరోగా వైభవి హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి "నెక్స్ట్ నువ్వే" అనే టైటిల్ ను ఖరారు చేశారు. తమిళం హిట్ మూవీ "యామిరుక్కు భయమే" ను రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. సరదాగా సాగిపోయే ఈ హర్రర్ కామెడీ సినిమా డేట్ ను ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు.. ఈ దసరాకు 'నెక్స్ట్ నువ్వే 'రానున్నది అని చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా ఈ సారి దసరాకు ఎన్టీఆర్ 'జై లవకుశ', మహేష్ బాబు 'స్పైడర్' లు రిలీజ్ అవుతున్నాయి. ఇటువంటి టాప్ మూవీస్ కు పోటీగా ప్రభాకర్ తన సినిమాను రిలీజ్ చేయడం సాహసం అని టాలీవుడ్ టాక్.. అంతేకాదు... ఈ సినిమాలకు తోడు రామ్ తాజా సినిమా ఉన్నది ఒకటే జిందగీ' సినిమాకూడా దసరాకు రిలీజ్ కానున్నది.. మరి ఈ సినిమాల మధ్య ప్రభాకర్ 'నెక్స్ట్ నువ్వే'కు థియేటర్స్ దొరుకుతాయా అన్న సందేహాలతో పాటు.. ఈ భారీ సినిమాల మధ్య తన సినిమా పోటీగా రిలీజ్ చేసి.. చిన్న సినిమాలు ఊహించని ఘన విజయం సాధిస్తున్న నేపద్యంలో ప్రభాకర్ అదే సెంటిమెంట్ రిపీట్ చేస్తాడా అని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
తాజా వార్తలు
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!







