వ్యాట్‌ ఎఫెక్ట్‌: మోటార్‌ ప్రీమియమ్‌ల పెంపు

- August 20, 2017 , by Maagulf
వ్యాట్‌ ఎఫెక్ట్‌: మోటార్‌ ప్రీమియమ్‌ల పెంపు

యూఏఈలో మోటరిస్టులు ఇన్స్యూరెన్స్‌ బిల్లులను చెల్లించేందుకు అదనంగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2018 నుంచి 5 శాతం వ్యాట్‌ అమల్లోకి తీసుకురానున్న దరిమిలా, ఈ ప్రభావం మోటరిస్టుల ఇన్స్యూరెన్స్‌ బిల్లుపైనా కనబడనుంది. లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ కాకుండా మిగతా అన్ని ఇన్స్యూరెన్స్‌లూ వ్యాట్‌ పరిధిలోకి వస్తాయని ట్యాక్స్‌ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. యూఏఈ ఇన్స్యూరెన్స్‌ అథారిటీ తాజాగా సవరించిన ప్రతిపాదనల నేపథ్యంలో ఇప్పటికే చాలావరకు వాహనదారులు ఇన్స్యూరెన్స్‌ కోసం ఎక్కువమొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఇప్పుడు ఆ మొత్తం ఇంకా ఎక్కువగా పెరగనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com