మోసాల నుండి రక్షించడానికి డెబిట్ కార్డులను బ్లాక్ చేస్తున్న ఎస్‌బీఐ
- August 21, 2017
డెబిట్ కార్డులతో జరుగుతున్న మోసాల నుండి రక్షించడానికి ఎస్‌బీఐ కార్డులను శాశ్వతంగా బ్లాక్ చేస్తున్నట్లు బ్యాంకు అధికారులు ప్రకటించారు. ఈవీఎం చిప్, పిన్ ఆధారిత మోడల్స్‌ను ప్రవేశ పెట్టాలని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించింది. 2017 సెప్టెంబర్ 30 నాటికల్లా అన్ని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటిఎం ఆపరేటర్లు చిప్ కార్డు ఆధారిత ఏటిఎం మోడల్‌లోకి మారాలని స్పష్టం చేసింది. ఈ కార్డులను మార్చుకోవడానికి ఖాతాదారులు వెంటనే బ్యాంకుకు కాంటాక్ట్ చేయాలని లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కార్డులను మార్చుకోవాలని బ్యాంకు సూచించింది. ఈవీఎం చిప్ డెబిట్ కార్డులను బ్యాంకు ఉచితంగా కష్టమర్లకు అందించనుంది. డెబిట్ కార్డును దగ్గరగా పట్టుకుని చూస్తే కార్డు వెనకాల నల్లటి మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఉంటుంది లేదా ముందువైపు చిప్ ఉంటుంది. లేదా రెండు వైపులా ఉండే అవకాశం ఉంది. చిన్న మాగ్నెట్‌తో ఈ చిప్ తయారవుతుంది. దీనిలో మొత్తం అకౌంట్ సమాచారం ఉంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







