అత్యంత వేగంగా ప్రయాణించే బులెట్ రైలు చైనాలో ప్రారంభం
- August 21, 2017
ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే బులెట్ రైలును చైనా సెప్టెంబరు 21 నుంచి నడపనుంది. రాజధాని బీజింగ్ నుంచి వాణిజ్య రాజధాని షాంఘైకి (దూరం 1250 కి.మీ.) ఈ రైలు కేవలం నాలుగున్నర గంటల్లో చేరుకోగలదు. ప్రస్తుతం నడుస్తున్న బులెట్ రైళ్లు ఈ దూరానికి ఆరు గంటల సమయం తీసుకుంటున్నాయి. ఫక్సింగ్ పేరుతో ప్రవేశపెడుతున్న అధునాతన బులెట్ రైళ్లు గంటకు 350 కి.మీ. వేగంతో ప్రయాణించగలవు. వాణిజ్య ప్రాతిపదికన ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రైలు ఇదే అవుతుందని చైనా రైల్వే సంస్థ తెలిపింది. మొట్టమొదటి అధికవేగ రైలును 350 కి.మీ. వేగంతో బీజింగ్ నుంచి తియాంజిన్‌కు 2008 ఆగస్టులో చైనా నడిపింది. ఆ తర్వాత మరో మూడు అధికవేగ మార్గాలను తెరిచింది. 2011 జులైలో రెండు బులెట్ రైళ్లు ఒకదానినొకటి ఢీకొని 40 మంది చనిపోయిన తర్వాత వీటి వేగాన్ని 250-300 కి.మీ.కి తగ్గించింది. కొత్తగా ఫక్సింగ్ రైళ్లను జూన్‌లో సిద్ధం చేసింది. ఇవి గరిష్ఠంగా గంటకు 400 కి.మీ. దూరం ప్రయాణించగలవు. వీటి భద్రత, విశ్వసనీయతపై గత నెలలోనే పరీక్షలన్నీ పూర్తయ్యాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









