పథకాల అమల్లో స్పీడ్ పెంచుతున్నతెలంగాణ సీఎం కేసీఆర్
- August 21, 2017
అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయింది. మళ్ళీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. అధికారం నిలబెట్టుకోవాలంటే.. గత హామీల్ని నెరవేర్చాలి. చేసిన పనుల్ని చెప్పుకోవాలి. ఇదే కేసిఆర్ ఆలోచన. తనదైన శైలిలో ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ఎన్నికల హామీల అమల్లో జాప్యం జరక్కూడదన్నది కేసీఆర్ వ్యూహం. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఉద్యోగాల భర్తీ, దళితులకు మూడెకరాలు, పెన్షన్లు గత ఎన్నికల్లో కారుకు ఓట్లను కురిపించాయి. ఇప్పటికే 40 లక్షల మందికి పెంచిన పెన్షన్లు అందిస్తోంది ప్రభుత్వం. ఈ విషయంలో ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఇళ్లు, ఉద్యోగాలు, భూ వాగ్దానాలు కూడా నెరవేరిస్తే.. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు అస్త్రాలే ఉండవని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. ఆ దిశగా వేగంగా అడుగులేస్తున్నారు. ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టిన కేసీఆర్.. ఈ అంశానికి పంద్రాగస్టు ప్రసంగంలోను ప్రాధాన్యమిచ్చారు. రెండేళ్లలో 86వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఇక, ఇళ్ల నిర్మాణం విషయానికి వస్తే.. హైద్రాబాద్‌లో 1600 గృహాలకు రీసెంట్‌గా శంకుస్థాపన చేసిన కెటీఆర్.. ఏడాదిలో లక్ష ఇళ్లు నిర్మిస్తామన్నారు. గ్రామీణ ప్రజలూ డబుల్ బెడ్రూమ్‌లపై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. వారి కలలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దళితులకు మూడెకరాల భూపంపిణీ వేగవంతం చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో భూమి అందుబాటులో ఉన్నా.. చాలాచోట్ల ఇబ్బంది తప్పట్లేదు. ప్రభుత్వం చేపట్టిన భూసర్వే తర్వాత ఈ స్కీమ్ వేగం అందుకోనుంది. మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు అనుకున్న టైంలో పూర్తి చేయాలని కార్యాచరణ ప్రకటించారు. ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించినా పనుల్లో వేగం తగ్గకూడదని సర్కార్ భావిస్తోంది. మిషన్ కాకతీయతో ఇప్పటికే కొన్ని ప్రాంతాలు లాభపడ్డాయి. అదే జోష్‌తో భగీరథ పనులను పూర్తి చేసేలా ముందుకెళ్తున్నారు. గొర్రెల పంపిణి.. చేపల పెంపకం లాంటి పథకాల అమలుతో బీసీ వర్గాలకు చేరువైన ప్రభుత్వం.. కేసిఆర్ కిట్లతో మహిళల్లో ఆదరణ పొందింది. ఈ దిశగా మరిన్ని పథకాలకు శ్రీకారం చుట్టేందుకు సీఎం కసరత్తు చేస్తున్నారు. గత హామీల అమలుతో విపక్షాలకు చెక్ పెట్టాలని కేసీఆర్ వ్హూయం. పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణనూ సిద్ధం చేస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







