ట్రిపుల్ తలాఖ్ ఆరు నెలలు నిషేధం సుప్రీంకోర్టు సంచలన తీర్పు
- August 21, 2017
ట్రిపుల్ తలాఖ్‌పై ఆరు నెలలు నిషేధం
ఈ ఆరు నెలల్లో చట్టం తీసుకురావాలి
కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు
ముస్లిం సామాజికవర్గంలో అమల్లో ఉన్న వివాదాస్పద విడాకుల విధానం ట్రిపుల్ తలాఖ్‌పై సుప్రీంకోర్టు మంగళవారం తన తీర్పును వెలువరించింది. ట్రిపుల్ తలాఖ్ రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 3:2 మెజారిటీతో తీర్పు వెలువరించింది. ముస్లిం మహిళల ప్రాథమిక హక్కులకు ట్రిపుల్ తలాఖ్ భంగం కలిగిస్తున్నదని, రాజీకి ఏమాత్రం అవకావం ఇవ్వకుండా ఏకంగా వివాహాన్ని రద్దు చేయడం ఎంతమాత్రం సమ్మతం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఈ విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఈ విధానంపై ఆరు నెలల్లోపు పార్లమెంటులో చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆరు నెల కాలంలో ట్రిపుల్ తలాఖ్ విధానాన్ని అనుసరించకుండా సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
ఆరు నెలల్లో చట్టాన్ని తీసుకురాకపోతే.. ట్రిపుల్ తలాఖ్‌ను కొనసాగించాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో రాజకీయాలను పక్కనబెట్టి అన్ని పార్టీలు చట్టం తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచించింది. రాజ్యాంగ ధర్మాసనంలోని ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్, మరో న్యాయమూర్తి ఎస్ అబ్దుల్ నజీర్ ట్రిపుల్ తలాఖ్‌ను సమర్థించగా.. ఇతర న్యాయమూర్తులైన జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ కురియన్ జోసెఫ్ వారి తీర్పుతో విభేదించారు. ఈ ముగ్గురు న్యాయమూర్తులు ట్రిపుల్ తలాఖ్ రాజ్యాంగ విరుద్ధమంటూ మెజారిటీ తీర్పు వెలువరించారు. కాగా, ఇస్లాంలో భాగమైన సున్నీ వర్గం ప్రజలు గత వెయ్యేళ్లుగా ట్రిపుల్ తలాఖ్ విధానాన్ని అనుసరిస్తున్నారని జస్టిస్ జేఎస్ ఖేహర్ అన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







