జైల్లో కారిడార్‌ను సొంత ఇంటిలావాడుకుంటున్న శశికళ
- August 21, 2017
పరప్పణ అగ్రహార జైలులో శిక్షననుభవిస్తున్న ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ జైలులో సుమారు 120 నుంచి 150 అడుగల పొడవున్న కారిడార్‌ను ఇరువైపులా బారికేడ్లు పెట్టి ప్రైవేటు స్థలంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయాన్ని జైళ్ల శాఖ మాజీ డిఐజి డి రూప ఎసిబికి ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. ఈ కారిడార్‌లో ఉన్న ఐదు గదులు శశికళ ఉపయోగించుకుంటున్నారని, ఆమె వ్యక్తిగత సామగ్రి వాటిలో ఉందని రూప పేర్కొన్నారు. దుస్తులు, బెడ్డింగ్, వంటపాత్రలు, వాటర్ ఫిల్టర్, ఎలెక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్, ఒక టేబుల్ ఈ గదుల్లో ఉన్నాయని ఎసిబి ఐజిపికి ఇచ్చిన లేఖలో రూప పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలు లేకుండా అనధికారికంగా ప్రత్యేక సదుపాయాలు కల్పించడం కోర్టు ధిక్కారమవుతుందని, అంతేకాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించినట్లవుతుందని రూప పేర్కొన్నారు. జైలుకు వచ్చిన సందర్శకులను కలవడానికి శశికళ ప్రత్యేకంగా సదుపాయాలు కలిగిన మీటింగ్ రూమ్‌ను ఉపయోగించుకుంటున్నారని, దీనిలో చుట్టూ పరదాలు ఉండి లోపల ఏం జరుగుతున్నదో తెలిసే అవకాశం లేదని రూప తెలిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలను 6, 7 నెంబర్ల సిసిటివి కెమేరాలలో చూడవచ్చునని రూప అన్నారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







