హాలీవుడ్ ఆఫర్‌ని వదులుకున్న దీపికా
- August 22, 2017
సాధారణంగా టాలీవుడ్ యాక్టర్స్‌కి బాలీవుడ్లో నటించాలని వుంటుంది. బాలీవుడ్ యాక్టర్స్కేమో హాలీవుడ్ మూవీస్‌లో నటించాలని వుంటుంది. అవకాశాలు రావాలేగాని ఎగిరి గంతేస్తుంటారు. వచ్చిన అవకాశాన్ని అస్సలు వదులకోరు. తమ కల నెరవేరబోతోందని ఆనందపడిపోతుంటారు. అయితే ఇప్పటికే బాలీవుడ్లో తన స్థానాన్ని సుస్ధిరపరుచుకున్న బాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకునే మాత్రం హాలీవుడ్ ఆఫర్స్‌ని అంగీకరించట్లేదు. ఇందుకు తన కారణాలు తనవి.
'ట్రిపుల్ ఎక్స్:జాండర్ కేజ్' సినిమాతో హాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన బాలీవుడ్ భామ దీపిక పదుకునే ఆ తరువాత మరే హాలీవుడ్ సినిమాలోనూ నటించలేదు. ఆ మధ్య వచ్చిన 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్'లో మరోసారి నటించే అవకాశం వచ్చింది. అయితే అప్పుడు సంజయ్ లీలా భన్సాలీ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉండడంతో ఆ ఆఫర్‌ని వదిలేసుకుంది. ఇప్పుడు కూడా హాలీవుడ్‌లోని ఓ పెద్ద సంస్ధనుంచి ఇంకో అవకాశం వచ్చింది. దాన్ని కూడా కాదనుకుంది. కారణం అదే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న 'పద్మావతి' చిత్రంలో బిజీగా ఉంది. 'రామ్‌లీలా', 'బాజీరావు మస్తానీ' చిత్రాల తరువాత దీపికా,రణవీర్‌లు కలిసి నటిస్తోన్న చిత్రం 'పద్మావతి'. ఇందులో షాహిద్ కపూర్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







