మహేష్ బాబు అభిమానులకు స్పైడర్ ఒక సర్ప్రైజ్

- August 22, 2017 , by Maagulf
మహేష్ బాబు అభిమానులకు స్పైడర్ ఒక సర్ప్రైజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న స్పైడర్ రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. తమిళ స్టార్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. హిందీ, మలయాళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాను అరబ్ దేశాల్లో రిలీజ్ చేసేందుకు అరబిక్ లోనూ డబ్ చేస్తున్నారు.

భారతీయ భాషలతో పాటు అరబిక్ లోనూ ఒకేసారి సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ లు భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా హరీశ్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com