మాల్దీవులకు పయనమవుతున్న భాస్కర్ ఒరు రాస్కెల్ టీం
- August 22, 2017
భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్ర యూనిట్ మాల్దీవులకు పయనం అవుతోంది. మలయాళంలో మమ్ముట్టి, నయనతార జంటగా నటించిన భాస్కర్ ది రాస్కెల్ చిత్రానికి రీమేక్ అవుతున్న చిత్రం భాస్కర్ ఒరు రాస్కెల్.
ఇందులో అరవిందస్వామి, అమలాపాల్ జంటగా నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రల్లో నాజర్, సూరి, రోబోశంకర్, రమేశ్‌ఖన్నా, సిద్ధిక్ మాస్టర్ రాఘవ నటిస్తున్నారు. తెరి చిత్రం ద్వా రా బాలతారగా పరిచయమైన నటి మీనా కూతురు నైనిక, కీలక పాత్రల్లో బాలీవుడ్ నటుడు అఫదవ్ వివద్‌శాని నటిస్తున్నారు. ఒక ప్రత్యేక పాత్రలో నటి నికీషాపటేల్ నటిస్తుం డడం విశేషం. మలయాళ చిత్రానికి దర్శకత్వం వహించిన సిద్ధికే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ప్రస్తుతం చిత్ర చివరి షెడ్యూల్‌ను చెన్నైలో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. ఇందులోని ఒక పాటను మాల్దీవుల్లో చిత్రీకరించనున్నామని, అందుకు ఈ నెల 27ను చిత్ర యూనిట్ మాల్దీవులకు పయనం కానందని తెలిపారు. ఈ పాటతో చిత్ర షూటింగ్ పూర్తి అవుతుందని చెప్పారు. అనంతరం నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







