తమిళ సినీరంగం ఈ నెల 26న షూటింగులు రద్దు ప్రకటించింది
- August 22, 2017
ఈ నెల 26వ తేదీన సినిమా షూటింగ్లను రద్దు చేస్తున్నట్లు తమిళ నిర్మాతల మండలి ప్రకటించింది. ఇంతకుముందు దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) సమ్మె కారణంగా మూడు రోజుల పాటు షూటింగులు రద్దయిన విషయం తెలిసిందే. ఆ సమస్య చర్చల్లోనే ఉంది. కాగా ఈ నెల 26వ తేదీన షూటింగులను ఒక్క రోజు రద్దు చేయనున్నట్లు తమిళ నిర్మాతలమండలి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
అందులో పేర్కొంటూ దక్షిణ భారత సినీ, బుల్లితెర స్టంట్ దర్శకులు, స్టంట్ కళాకారుల సంఘం 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 26వ తేదీన చెన్నైలో స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించనుందన్నారు. అందువల్ల ఆ రోజున షూటింగులను రద్దు చేయవలసిందిగా కోరడంతో అంగీకరించినట్లు తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







