ఈ నెల చివర్లోనే రానున్న కొత్త రూ.200 నోటు
- August 22, 2017
చరిత్రలోనే మొట్టమొదటిసారి 200 డినామినేటెడ్ బ్యాంకు నోట్లు మార్కెట్లోకి ప్రవేశించబోతున్నాయి. ఆగస్టు చివరి రోజుల్లో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ కొత్త రూ.200 బ్యాంకు నోట్లను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా చలామణిలోకి తీసుకు రాబోతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ముఖ్యంగా బ్లాక్ మార్కెటింగ్‌కు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకున్న అనంతరం రూ.50 కోట్ల నోట్లను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నోట్ల చలామణిలో ఎలాంటి అక్రమ ట్రేడింగ్ జరుగకుండా ఉండేందుకు ఆర్బీఐ అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటి వరకు రూ.100, రూ.500 డినామినేషన్ నోట్లకు మధ్యలో ఎలాంటి ఇతర డినామినేషన్ నోట్లు లేవు.
ఆర్బీఐ ప్రస్తుతం తీసుకురాబోతున్న రూ.200 నోట్లు మరింత ప్రాధాన్యత సంతరించుకోబోతున్నాయి. ఈ కారణంతోనే పకడ్బందీగా ఈ నోట్లను విడుదల చేయాలని చూస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఆర్బీఐ మాత్రం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. పెద్ద మొత్తంలో ఈ నోట్లను విడుదల చేస్తుండటంతో, సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న కార్యాచరణ సమస్యలను ఇవి నిరోధిస్తాయని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ సౌమ్య కాంతి ఘోస్ చెప్పారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం మొట్టమొదటిసారి ఆర్బీఐ తీసుకొచ్చిన రూ.2000 బ్యాంకు నోట్లలో తీవ్రంగా బ్లాక్ మార్కెటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఐటీ అధికారులు, ఏజెన్సీలు జరిపిన తనిఖీల్లో గుట్టలుగుట్టలు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







