ఇటలీ పర్యాటక కేంద్రంలో సోమవారం బారి భూంకంపం
- August 22, 2017
- ఒకరు మృతి, పలువురికి గాయాలు
ఇటలీలోని ఇచియా అగ్నిపర్వత ప్రాంతానికి సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రంలో సోమవారం భూకంపం సంభవించింది. రిచ్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదైంది. ఈ భూకంప తీవ్రతకు స్థానిక మహిళ ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డారు. అనేకమంది ఆచూకీ తెలియరావడం లేదు. వీరు కూలిపోయిన భవనాల కింద చిక్కుకుపోయి వుంటారని భావిస్తున్నారు. పలు భవనాలు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. శిధిలాల కింద చిక్కుకుపోయి చనిపోయిన ఆ మహిళ మృతదేహాన్ని ఇంకా వెలికితీయలేదు. శిధిలాల వెలికితీతకు చర్యలు తీసుకుంటున్నామని, పెద్ద ఎత్తున గాలింపు చేపట్టామని అధికారులు తెలిపారు. శిధిలాల కింద చిక్కుకుపోయిన ముగ్గురు పిల్లలను కాపాడారు. ఆ దీవి నుండి ప్రజలను తరలించేందుకు బోట్లను, హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. గాయపడిన వారిని వైద్య సాయం నిమిత్తం హెలికాప్టర్లలో తక్షణమే నాప్లెస్కు తరలించారు. నాప్లెస్ నగరానికి సమీపంలో, ఇటలీ తీర ప్రాంతానికి 10కిలోమీటర్ల దూరంలో రాత్రి 9గంటల సమయంలో భూ కంపం వచ్చినట్లు స్థానిక మీడియా వార్తలు తెలిపాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







