సల్మాబాద్ వేర్ హౌస్‌లో భారీ అగ్ని ప్రమాదం
- August 23, 2017
నార్తరన్ గవర్నరేట్ పరిధిలోని సల్మాబాద్ ప్రాంతంలోగల ఓ వేర్ హౌస్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఇన్‌ఫ్లేమబుల్ ఐటమ్స్‌ని స్టోర్ చేసినట్లుగా తెలియవస్తోంది. ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా ప్రాణ నష్టంపై ఎలాంటి సమాచారం లేదు. సివిల్ డిఫెన్స్ ఫైర్ ఫైటర్స్ సమాచారం అందుకోగానే ఘటనా స్థలికి చేరుకుని, సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మంటల్ని ఆర్పివేసేందుకు ప్రయత్నించారు. ప్రమాదం 12.47 నిమిషాలకు చోటుచేసుకోగా కేవలం ఏడు నిమిషాల్లోనే 12 వాహనాలతో కూడిన అధికార బృందం అక్కడికి చేరుకుంది. 45 మంది ఫైర్ ఫైటర్స్ అగ్ని కీలల్ని ఆర్పివేయడంలో కృషి చేశారు. సమీపంలో ఉన్న భవనాలకు మంటలు వ్యాపించకుండా చేయగలిగారు. దాంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియవలసి ఉంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







