సల్మాబాద్ గిడ్డంగిలో భారీ అగ్నిప్రమాదం
- August 23, 2017
ఉత్తర గవర్నైట్ పరిధిలోని సల్మాబాదులో ఒక గిడ్డంగిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భవనంలో ఉన్న ఉద్యోగులు ఖాళీ చేయబడ్డారు కాని సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. సివిల్ డిఫెన్స్ అగ్నిమాపకదళ సిబ్బంది వెంటనే ప్రమాద సన్నివేశంకు వచ్చి మంటలను అదుపు చేశారు. వర్క్స్ మరియు పురపాలక వ్యవహారాల , అర్బన్ ప్లానింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన గిడ్డంగిలో చెలరేగిన మంటలను ఆర్పేందుకు పన్నెండు వాహనాలు పాల్గొన్నాయి.సల్మాబాదులోని వర్క్స్, మునిసిపాలిటీ అఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ మంత్రిత్వ శాఖతో అనుసంధానించబడిన ఒక గిడ్డంగిలో ఒక పెద్ద అగ్ని ప్రమాదాన్ని అదుపుచేశారని అంతర్గత వ్యవహారాల శాఖ ఈ సంఘటనను ధృవీకరించింది. మధ్యాహ్నం 12:47 సమయంలో గిడ్డింగిలో మంటలు వ్యాపించినట్లు సమాచారం తెలియడంతో పౌర రక్షణ జట్టు అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతానికి 7 నిమిషాల్లో చేరుకుంది. పన్నెండు వాహనాలలో 45 మంది సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకొని అగ్నిని నియంత్రణలోకి తెచ్చారు. సమీపంలోని ఇళ్ళు మరియు భవంతులకు మంటలు వ్యాప్తి చెందకుండా అగ్నిమాపకదళ సిబ్బంది నివారణ చర్యలు తీసుకొన్నారు. ఈ అగ్నిప్రమాదం ఏ విధంగా సంబవించిందోనని తెలుసుకొనేందుకు సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని జనరల్ డైరెక్టర్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ తెలిపింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









