బ్రిటన్‌లో నాలుగు శాతం తగ్గిన భారతీయ వీసాలు
- August 24, 2017
బ్రిటన్‌లో నైపుణ్య ఉద్యోగవీసాల కోసం భారతీయుల దరఖాస్తుల సంఖ్య నాలుగు శాతం పడిపోయిందని అక్కడి హోం కార్యాలయం పేర్కొంది. 2017 జూన్ ముగిసే నాటికి 29,800 భారతీయులు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. వలసల నియంత్రణ కోసం వీసాల జారీలో బ్రిటన్ ప్రభుత్వం నిబంధనలను కఠినంగా మార్చిన విషయం తెలిసిందే. 5,686 దరఖాస్తులతో అమెరికా భారత్ తర్వాతి స్థానంలో నిలిచిందని వెల్లడించింది. ఈ వీసాల సహాయంతో విదేశీయులు అక్కడే నివసిస్తూ ఉద్యోగం చేసుకోవచ్చు.
బ్రిటన్‌లోని జాతీయ గణాంకాల వివరాల ప్రకారం బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటివరకు జారీ చేసిన మొత్తం 92,805 ఉద్యోగ వీసాల్లో 53,366 వీసాలు భారతీయులకే మంజూరు చేసింది. అందులో 42 శాతం వీసాలు ఐటీ రంగంలోనే అందించారు.
తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం బ్రెక్సిట్ తరవాత ఐరోపా దేశాల నుంచి బ్రిటన్‌కు వలసలు తగ్గుముఖం పట్టాయని తెలుస్తోంది. మరోవైపు వీసా దరఖాస్తుల పతనంతో ఉద్యోగాలకు సరైన వ్యక్తులను ఎంపిక చేయడానికి స్థానిక సంస్థలకు కష్టంగా మారే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







