సూపర్ స్టార్ రికార్డు వెనక్కినెట్టిన అజిత్ 'వివేకం'
- August 24, 2017
అగ్ర తమిళ కథానాయకుడు అజిత్ మరోసారి కింగ్ ఆఫ్ ద ఓపెనింగ్ అనిపించుకున్నారు. ఆయన నటించిన చిత్రం 'వివేకం'. కాజల్, వివేక్ ఓబెరాయ్, అక్షర హాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. శివ దర్శకత్వం వహించగా సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలుగా వ్యవహరించారు. అనిరుధ్ స్వరాలు అందించారు. గురువారం (ఆగస్టు 24) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి టాక్ అందుకుంది. కాగా ఈ చిత్రం తొలిరోజున చెన్నై సిటీ బాక్సాఫీసు వద్ద వసూళ్ల దుమ్మురేపింది.
ఇప్పటి వరకు ఓపెనింగ్స్‌లో ముందున్న రజనీకాంత్ 'కబాలి', విజయ్ 'తెరి' చిత్రాల రికార్డులను (కేవలం చెన్నై సిటీ బాక్సాఫీసు వద్ద) 'వివేకం' వెనక్కినెట్టి.. రూ. 1.21 కోట్లు రాబట్టిందని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో అజిత్ కింగ్ ఆఫ్ ఓపెనింగ్ అని నిరూపించుకున్నారని అన్నారు. ఓపెనింగ్ రోజున 'కబాలి' రూ.1.12 కోట్లు, 'తెరి' రూ. 1.05 కోట్లు రాబట్టాయి. 'వివేకం' అమెరికా బాక్సాఫీసు వద్ద బుధవారం నిర్వహించిన ప్రీమియర్‌లో రూ. 1.37 కోట్లు రాబట్టి.. 15వ స్థానంలో నిలిచిందని విశ్లేషకులు చెప్పారు. అమెరికాలో తొలిరోజున (గురువారం) రూ. 1.57 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- GMU అలుమ్ని సమ్మిట్ 2026.. నాలుగు దేశాల్లో కొత్త అంతర్జాతీయ అలుమ్ని చాప్టర్ల ప్రారంభం
- దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 2026.. డిసెంబర్ 4 నుంచి 45 రోజుల పాటు సందడే సందడి!
- ఎన్విడియా సీఈవోగా మళ్లీ జెన్సన్ హువాంగ్
- సౌదీ–కువైట్ నేతల మధ్య కీలక చర్చలు
- బుల్లెట్ రైలు ట్రయల్ రన్ పై అశ్విని వైష్ణవ్ కీలక అప్డేట్
- యూఏఈ 55వ ఈద్ అల్ ఎతిహాద్ వేడుకలకు ఐదు రోజుల సంబరాలు..
- ఆఫీసు కంప్యూటర్లలో వాట్సాప్ వాడకంపై కేంద్రం హెచ్చరిక
- తమకు జరిగిన నష్టానికి అమెరికా బాధ్యత వహించాలి: ఇరాన్
- యూఏఈలో ప్రభుత్వ సేవలకు ఏఐ అసిస్టెంట్ ‘మీరా’..!!
- ఒమన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 17 మందికి గాయాలు..!!







