సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా సెప్టెంబర్ రెండో వారంలో ప్రాజెక్ట్ Z విడుదల
- August 25, 2017
ఎస్.కె. అబ్దుల్లా సమర్పణలో ఎస్.బి.కె ఫిల్మ్ కార్పోరేషన్ నిర్మిస్తోన్న చిత్రం ప్రాజెక్ట్ Z. ఈ చిత్రంలో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, జాకీష్రాఫ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు సి.వి.కుమార్. నిర్మాతలు ఎస్.కె. బషీద్, ఎస్.కె. కరిమున్నీసా. ఈ చిత్రం సెప్టెంబర్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన ఎస్.కె. బషీద్ చిత్ర విశేషాలను మీడియాకి వివరించారు. ఆయన మాట్లాడుతూ.. మా ఈ ప్రాజెక్ట్ జెడ్ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికెట్‌ని సెన్సార్ సభ్యులు ఇచ్చారు. చిత్రం చాలా బాగా వచ్చింది. సందీప్‌కిషన్ ఈ చిత్రంలో డిఫరెంట్ రోల్లో నటించాడు. అతడి కెరీర్లో ఈ చిత్రం పెద్ద హిట్ చిత్రంగా నిలబడుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ చిత్రం కాన్సెఫ్ట్ అంత కొత్తగా ఉంటుంది. జిబ్రాన్ చాలా మంచి మ్యూజిక్‌ని ఇచ్చాడు. ప్రేక్షకులు డిజప్పాయింట్ అయ్యే మూవీ మాత్రం కాదని పక్కాగా చెబుతున్నా. రాబోయే పది సంవత్సరాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయనేదే ఈ చిత్ర కథ. సెన్సార్ వాళ్ళు కూడా ఈ చిత్రం చాలా బాగుందని టీమ్‌ని మెచ్చుకున్నారు. త్వరలో ఆడియో ఫంక్షన్‌ని నిర్వహించి, సెప్టెంబర్ రెండోవారంలో చిత్రాన్ని ప్రేక్షుల ముందుకు తీసుకువస్తాము. ఈ చిత్రంతో పాటు మరో రెండు చిత్రాలు మా బ్యానర్లో రెడీ అవుతున్నాయి. మా ఈ ప్రాజెక్ట్ Z విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను..అని అన్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం







