'వివేకం' మూవీ రివ్యూ

- August 25, 2017 , by Maagulf
'వివేకం' మూవీ రివ్యూ

అజిత్‌తో మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు డైరెక్టర్ శివ. ఈ నటుడితో వీరం, వేదాళం తెరకెక్కించి బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టిన శివ, 'వివేకం'తో గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఎన్నో అంచనాలు పెంచేసిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ స్పెషల్‌గా కనిపించాడు. ఇక అజిత్ పక్కన హీరోయిన్‌గా కాజల్ నటించింది. మరి మూవీ ఎలావుందో ఓసారి రివ్యూలోకి వెళ్లొద్దాం.
స్టోరీ
కౌంటర్ టెర్రరిజం ఏజెన్సీలో పనిచేసే ఏకే (అజిత్ కుమార్) ప్రపంచంలోనే అత్యంత సమర్ధుడైన, తెలివైన ఏజెంట్. ఎవరికీ దొరకని టెర్రరిస్టుల్ని కనిపెట్టి చంపడం ఆయన పని. తన నలుగురు ఫ్రెండ్స్ అంటే ప్రాణం. ఓ ఆపరేషన్‌లో భాగంగా నటాషా (అక్షర హాసన్‌) అనే హ్యాకర్‌ని పట్టుకోవడానికి బయల్దేరతాడు ఏకే. ఆ క్రమంలోనే ఏకే మాయమవుతాడు. అతడు చనిపోయాడని ఇంటెలిజెన్స్‌ రికార్డులు చెబుతున్నా, కానీ బ్రతికే ఉంటాడు. సడన్‌గా ఏకే మాయం వెనుక కారణమేంటి? ఈ సమయంలో ఏకే ఫ్రెండ్స్ ఆర్యన్ (వివేక్ ఒబెరాయ్), మరో ముగ్గురు ఏం చేశారు? తన భార్య హాసిని (కాజల్)ని ఏకే ఎలా కాపాడుకున్నాడు? నటాషాని ఎందుకు అన్వేషించాల్సివచ్చింది? ఎవరిపై ఏకే యుద్ధం చేశాడు? అన్నది స్టోరీ తెరపై చూడాల్సిందే!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com