అల్లర్లలో 11మంది బాబా అనుచరులు మృతి
- August 25, 2017
గుర్మీత్ అరెస్టుతో పంజాబ్, హర్యానా భగ్గుమంది. గంటలోనే రెండు రాష్ట్రాల్లో 224 చోట్ల హింస చెలరేగింది. పంజాబ్‌లోని మాలౌట్‌లో గుర్మీత్ అనుచరులు రెచ్చిపోయారు. విధ్వంసానికి పాల్పడ్డారు. రాళ్లు, కత్తులు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. పెట్రోల్‌బంక్, రైల్వేస్టేషన్ బస్‌స్టేషన్లు, షాపులకు నిప్పుపెట్టారు. గుర్మీత్ అనుచరుల విధ్వంసకాండతో సెక్టార్-5లో టియర్ గ్యాస్ ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. బలగాల మోహరింపుతో ఆందోళనకారులు మరింతగా రెచ్చిపోయారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. హింసాత్మక ఘటనల్లో 8 మంది ఆందోనకారులు మృతి చెందారు
అటు అంతకు ముందు పంచకుల సీబీఐ కోర్టు సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అనుచరులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కోర్టు వద్దకు చొచ్చుకొస్తున్న డేరా బాబా అనుచరులను పోలీసులు నిలువరించేందుకు ప్రయత్నం చేశారు. కానీ పరిస్థితి అదుపు తప్పడంతో.. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. కోర్టు వద్ద ఉన్న మీడియా వాహనాలపై డేరా బాబా అనుచరులు దాడి చేసి విధ్వంసం చేశారు. రెండు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 224 హింసాత్మక ఘటనలు జరిగాయి.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







