రాజకీయాల్లోకి వద్దామనుకుంటున్నా: సుమన్
- August 25, 2017రా అంటే రాక్షసంగా, జ అంటే.. జనానికి, కీ అంటే కీడు తలపెట్టే, యం అంటే యంత్రాంగం అంటూ రాజకీయానికి ఉన్న వికృత కోణాన్ని పరుచూరి బ్రదర్స్ ఏనాడో ఓ నిర్వచనంగా మార్చారు. ఈ మాటే హీరో సుమన్‌ని అడిగితే అలాంటి రాజకీయాలకు తాను దూరమని, ఇప్పటివరకూ ఏ రాజకీయ పార్టీలో తాను లేనని, భవిష్యత్తులో రాజకీయాల్లోకి వెళ్లవచ్చని సుమన్ అన్నారు. మంచి లక్ష్యాలు ఉన్న రాజకీయ పార్టీ, చక్కటి ఆదర్శాలు గల నేత, అదీ జనం కోసం నిజాయితీగా శ్రమించగలనేత వచ్చినప్పుడు ముఖ్యంగా అవినీతిని సమూలంగా అణగదొచ్చే సామర్థ్యం గల వ్యక్తి వస్తే అలాంటి పార్టీలో చేరడానికి తాను సిద్ధంగా ఉన్నానని హీరో సుమన్ అంటున్నారు. మధ్యతరగతి, పేద ప్రజానికానికి బాధలు తొలగించి సాయం చేసే వ్యక్తి వస్తే కచ్చితంగా తాను రాజకీయరంగ ప్రవేశం చేస్తానని సుమన్ స్పష్టంగా పేర్కొన్నారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ పార్టీలోకి సుమన్ రావచ్చా అనే వ్యూహాలకు ఆయన స్పష్టీకరణ బాట వేసినట్లు కొందరు భావిస్తున్నారు. మొత్తం మీద సుమన్‌కు ఇన్నాళ్లకు రాజకీయాల సెగ తగిలినట్టేనా..?.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!