హల్‌చల్ చేస్తున్న 'రోబో 2.0' సినిమా మేకింగ్ వీడియో
- August 25, 2017
తంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'రోబో' సినిమా భారీసక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈసినిమాకు సీక్వల్‌గా దర్శకుడు శంకర్ '2.0' సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. హీరో రజినీకాంత్‌తో పాటు చిత్రంలో భారీ తారాగణాన్ని ఎంపికచేశాడు శంకర్. రజినీ సరసన అమీజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాహుబలి సినిమా తర్వాత హాలీవుడ్ టెక్నీషియన్స్ సహాయంతో అంతటి వీఎఫ్‌ఎక్స్‌ని జోడించి శంకర్ ఈసినిమాను రూపొందిస్తున్నాడు. చిత్ర విడుదలపై అభిమానాలోకం ఎంతగానో ఎదురు చూస్తోంది.
కాగా కొద్దిసేపటిక్రితం దర్శకుడు శంకర్ '2.0' మేకింగ్ వీడియోను తన పేస్‌బుక్ ద్వారా బయటకు వదిలాడు. ఈవీడియోలోని దృశ్యాలు హాలీవుడ్ చిత్రాలను తలదన్నే విదంగా ఉన్నాయి. రజినీ స్టైల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అక్షయ్‌కుమార్, రజినీకాంత్‌లకు మేక్ అప్ వేస్తున్నప్పటి దృశ్యాలతో ఈవీడియో ఆద్యంతం మిరమిట్లు గొలిపే విదంగా ఉంది. మొత్తానికి మేకింగ్‌వీడియో చూస్తుంటే..
సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనే ఆతృత నెలకుంటోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







