రాజకీయాల్లోకి వద్దామనుకుంటున్నా: సుమన్
- August 25, 2017
రా అంటే రాక్షసంగా, జ అంటే.. జనానికి, కీ అంటే కీడు తలపెట్టే, యం అంటే యంత్రాంగం అంటూ రాజకీయానికి ఉన్న వికృత కోణాన్ని పరుచూరి బ్రదర్స్ ఏనాడో ఓ నిర్వచనంగా మార్చారు. ఈ మాటే హీరో సుమన్‌ని అడిగితే అలాంటి రాజకీయాలకు తాను దూరమని, ఇప్పటివరకూ ఏ రాజకీయ పార్టీలో తాను లేనని, భవిష్యత్తులో రాజకీయాల్లోకి వెళ్లవచ్చని సుమన్ అన్నారు. మంచి లక్ష్యాలు ఉన్న రాజకీయ పార్టీ, చక్కటి ఆదర్శాలు గల నేత, అదీ జనం కోసం నిజాయితీగా శ్రమించగలనేత వచ్చినప్పుడు ముఖ్యంగా అవినీతిని సమూలంగా అణగదొచ్చే సామర్థ్యం గల వ్యక్తి వస్తే అలాంటి పార్టీలో చేరడానికి తాను సిద్ధంగా ఉన్నానని హీరో సుమన్ అంటున్నారు. మధ్యతరగతి, పేద ప్రజానికానికి బాధలు తొలగించి సాయం చేసే వ్యక్తి వస్తే కచ్చితంగా తాను రాజకీయరంగ ప్రవేశం చేస్తానని సుమన్ స్పష్టంగా పేర్కొన్నారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ పార్టీలోకి సుమన్ రావచ్చా అనే వ్యూహాలకు ఆయన స్పష్టీకరణ బాట వేసినట్లు కొందరు భావిస్తున్నారు. మొత్తం మీద సుమన్‌కు ఇన్నాళ్లకు రాజకీయాల సెగ తగిలినట్టేనా..?.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!