అబ్బాసియాలో భారత జాతీయుడి మృతి

- August 26, 2017 , by Maagulf
అబ్బాసియాలో భారత జాతీయుడి మృతి

కువైట్: భారత జాతీయుడు తోజి థామస్‌ అనే వ్యక్తి క్రికెట్‌ ఆడుతూ ప్రాణాలు కోల్పోయిన ఘటన అబ్బాసియాలో చోటు చేసుకుంది. క్రికెట్‌ ఆడుతున్న సమయంలో తోజి థామస్‌ ఉన్నపళంగా కుప్పకూలిపోవడంతో వెంటనే అతన్ని ఆయన సన్నిహితులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రి వర్గాలు ఎమర్జన్సీ ట్రీట్‌మెంట్‌ అందించినా అతని ప్రాణాల్ని కాపాడలేకపోయినట్లు వెల్లడించారు.అహిలా స్విచ్‌ గేర్‌ కంపెనీలో తోజి థామస్‌ పనిచేస్తున్నారు. 36 ఏళ్ళ తోజి థామస్‌కి గత ఏడాదే వివాహమయ్యింది. ఆయనకు భార్య నీతు ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com