విటమిన్ డి పుడ్స్

- October 26, 2015 , by Maagulf
విటమిన్ డి పుడ్స్

విటమిన్ డి ఆహారంలో లభించేది చాలా తక్కువ. బలవర్థకమైన ఆహారాల్లో కూడా విటమిన్ డి తగిన మోతాదులో ఉండదు. కానీ దీన్ని సహజంగా పొందడానికే అవకాశం ఎక్కువ. విటమిన్ డిని సహజంగా సూర్యుడి కిరణాల ద్వారా పొందగలుగుతాం. కానీ వృత్తి రిత్యా బిజీగా ఉంటున్న ఈ జనరేషన్ సూర్యరశ్మిని చూడలేకపోతుంది. సూర్యుడి కిరణాలు తాకక ముందే ఆఫీసులకి చెక్కేయడం.. సూర్యుడు మబ్బులచాటుకు వెళ్లాక ఇంటికి చేరుకోవడం.. ఇది నేటితరం దినచర్య. అందుకే ప్రస్తుతం అనేక మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్పారు. మనకు సహజంగా లభించే వాటిలో విటమిన్ డి ఒకటి. కానీ.. కొంతమంది ఎండ తాకకుండా.. దుస్తులు వేసుకోవడం, గొడుగులు తీసుకెళ్లడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల.. పెద్దలలలో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తోందని.. అధ్యయనాలు చెబుతున్నాయి. విటమిన్ డి లోపం మిమ్మల్ని వివిధ దీర్ఘకాలిక వ్యాధులు మరియు అంటువ్యాధులు అతిథులుగా మారుస్తాయి. అలా వ్యాధుల బారీన పడకుండా ఉండాలంటే విటమిన్ డి పుడ్స్ తీసుకోవడం చాలా అవసరం. పాలు మరియు పాల ఉత్పత్తులు, బీన్స్, స్పినాచ్(ఆకుకూరలు), నట్స్ మరియు డ్రైడ్ ఫూట్స్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎముకలను స్ట్రాంగ్ ఉంచి లైఫ్ హాపీగా ఉండేలా చేసే కొన్ని టాప్ టెన్ విటమిన్ డి ఆహారాలు మీకోసం...  మష్రుమ్(పుట్టగొడుగు)ల్లో విటమిన్ డి మాత్రమే కాదు విటమిన్ బి5 ను కూడా అందిస్తుంది. తెల్లని పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల విటమిన్ డితో పాటు జింక్ మరియు ప్రోటీన్స్ పుష్కలంగా శరీరానికి లభ్యం అవుతుంది. పాలు విటమిన్ డికి ఒక మంచి సోర్స్ . ఒక గ్లాసు పాలలో మన శరీరానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి .ఇవి శరీరానికి ఎంతో అవసరం . మరియు పాలలో యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అత్యధిక శాతం న్యూట్రిషియన్స్ కలిగినటువంటి గుడ్లలో విటమిన్ డి మరియు విటమిన్ బి12 మరియు ప్రోటీనులు అధిక శాతంలో ఉంటాయి. కాబట్టి వీటిని తరచూ ఆహారంతో తీసుకోవడం చాలా ముఖ్యం. విటమిన్ డి కి మరో మూలాదారం చీజ్ . ఇది బోన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది మరియు ఓస్ట్రియోఫోసిస్ ను నివారిస్తుంది. లివర్లో కూడా విటమిన్ డి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా బీఫ్ యొక్క లివర్ లో అధికంగా లభ్యం అవుతుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మరియు హెల్తీ స్కిన్ మరియు హేర్ పొందడానికి సహాయపడుతుంది. సీ ఫిష్ లో సాల్మన్, తున మరియు క్యాట్ ఫిష్ వీటిలో విటమిన్ డి మాత్రమే కాదు ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా లభ్యం అవుతాయి. ఈ చేపలను ఫ్రై చేయడం కంటే గ్రిల్ చేసి తీసుకోవడం వల్ల ఎక్కువ మొత్తంలో న్యూట్రీషియన్స్ శరీరానికి అందుతాయి. చాలా చల్లగా ఉండే సముద్ర చేపల్లో కొంత మొత్తంలో విటమిన్ డి ఉంటుంది. తున అనే ఈ సముద్ర చేపలో విటమిన్ డి అత్యధిక శాతంలో ఉంటుంది మరియు శరీరానికి కావల్సినంత క్యాల్షియం కూడా పుష్కలంగా ఇందులో లభిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com