విశాల్ ఇంట చెల్లి పెళ్లి సందడి
- August 27, 2017
తమిళ చిత్ర పరిశ్రమతోపాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న కథానాయకుడు విశాల్. ఆయన సోదరి ఐశ్వర్య వివాహం ఆదివారం తెల్లవారుజామున ఘనంగా జరిగింది. ప్రముఖ నగల దుకాణం 'వుమ్మిడి' కుటుంబానికి చెందిన కృతిశ్ వుమ్మిడితో ఐశ్వర్య వివాహం జరిగింది. ఈ వేడుకకు హీరో కార్తి దంపతులతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. విశాల్ పెళ్లి పనులను దగ్గరుండి చూసుకున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఐశ్వర్య ప్రేమ వివాహం చేసుకున్నారు. గతంలో ఈ విషయాన్ని ఆమె బంధువు, నటి శ్రియా రెడ్డి మీడియాతో పంచుకున్నారు. 'అవును. ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోబోతున్నారు. ఇది వరకే ఇరు కుటుంబాలకు పరిచయాలు ఉన్నాయి' అని శ్రియ చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







