చిరు నటిస్తున్న ' సైరా నరసింహారెడ్డి' మల్టీస్టారర్ మూవీ
- August 27, 2017
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి' . ఇటీవలే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫై కామెంట్స్ చేసింది హీరోయిన్ నయనతార. 'సైరా నరసింహారెడ్డి' సినిమాని 'బిగ్గెస్ట్ మల్టీస్టారర్'గా అభివర్ణించింది నయనతార.
'సైరా నరసింహారెడ్డి' సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, ప్రముఖ కన్నడ నటుడు సుదీప్, తమిళ నటుడు విజయ్ సేతపతి.. ఇలా చాలామంది ప్రముఖులే నటిస్తున్నారు. అలా చూస్తే, 'సైరా నరసింహారెడ్డి' సినిమాని మల్టీస్టారర్ అనే అనుకోవాలి అంటూ తెలిపింది. బిగ్ బి అమితాబ్ ఈ మూవీ లో చిరంజీవి కి గురువుగా నటిస్తుండగా , విజయ్ సేతుపతి సిపాయి పాత్రలో కనిపించనున్నాడని వినికిడి. ఇక మిగితా పాత్రలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
నయనతార ఈ మూవీ తో పాటు బాలకృష్ణ సరసన కూడా నటిస్తుంది. కె.ఎస్.రవికుమార్ ఈ మూవీ ని డైరెక్ట్ చేస్తున్నాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







