బాలీవుడ్ నటుడు రిషికపూర్‌పై కేసు నమోదు
- August 27, 2017
ట్విటర్‌లో రెచ్చగొట్టే పోస్టులు పెడుతూ విమర్శలపాలయ్యే బాలీవుడ్ సీనియర్ నటుడు రిషికపూర్ తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఓ చిన్నారి అసభ్య ఫొటోను ట్విటర్‌లో పెట్టినందుకు ఆయనపై ముంబయిలోని సైబర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టం(పోస్కో) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని 'జైహో' అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు అఫ్రోజ్ మాలిక్ చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
'రిషికపూర్‌కు ట్విటర్‌లో 2.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అంటే ఆ అసభ్యకర చిత్రాన్ని అంతమంది చూశారు. పైగా దానికి 66 రీట్వీట్‌లు, 476 లైక్స్ వచ్చాయి' అని మాలిక్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రకు చెందిన జైహో స్వచ్ఛంద సంస్థ ఆ రాష్ట్రంలో మహిళల, పిల్లల అభివృద్ధి కోసం పాటుపడుతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







