తనీష్, శృతి యుగళ్ జంటగా ప్రేమిక ఆడియో రిలీజ్
- August 27, 2017
తనీష్, శృతి యుగళ్ జంటగా నటించిన చిత్రం 'ప్రేమిక'. దేశా ల లక్ష్మయ్య ఈ చిత్రాన్ని నిర్మి సున్నారు. మహేంద్ర దర్శకు డు. దిలీప్ బండారి సంగీ తాన్ని అందించిన 'ప్రేమిక' పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్ రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో జరిగిం ది. ఈ కార్యక్రమానికి పలు వురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఆడియో విడుదల అనంతరం చిత్ర సమర్పకులు ఎస్వీఎన్ రావు మాట్లాడుతూ.'గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. అమ్మాయిలతో ఉండాలంటే ప్రేమిస్తే సరిపోద్దని కొందరు యువకులు భావిస్తుంటారు. కానీ పోషించాలంటే డబ్బు కావాలనే విషయం తెలుసుకున్నాక..వాళ్ల ఆలోచనలు మార్పులు వస్తాయి. ప్రేమలో, జీవితంలో ఈ యువత ఎలా గెలిచారన్నది కథలో చూపిస్తున్నాం.' అన్నారు. చిత్ర దర్శకుడు మహేంద్ర మాట్లాడుతూ.'ఇది నా మొదటి చిత్రం. మంచి కథతో మీ ముందుకొస్తున్నాను. నిర్మాత సహకారం మర్చిపోలేను. మొత్తం యూనిట్ అందరికీ కృతజ్ఞతలు.' అన్నారు.
నిర్మాత దేశాల లక్ష్మయ్య మాట్లాడు తూ..'చిన్న చిత్రంగా కాదు పెద్ద సినిమాగానే భావించి నిర్మించాం. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి సినిమాను పూర్తి చేశాం. సెప్టెంబర్ 8న తెరపైకి తీసుకొస్తాం.' అన్నారు. కథానాయకుడు తనీష్ మాట్లాడుతూ.'మహేందర్ కథ చెప్పినప్పుడు ఇంత మంచి కథ చెప్పినట్లు చేయగలడా అని సందేహం కలిగింది.
నా కెరీర్లో గొప్ప కథను అందించిన దర్శకుడికి కృతజ్ఞతలు. సాంకేతిక వర్గం, నటీనటులు ఒక్కటిగా శ్రమించి సినిమా చేశాం.' అన్నారు.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







