తనిష్క్ రెడ్డి నటిస్తున్న దర్పణం షూటింగ్ ప్రారంభం
- August 27, 2017
తనిష్క్ రెడ్డి, అలెక్సియస్, సుభాంగీ పంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'దర్పణం'. శ్రీ సిద్ధి వినాయక ప్రొడక్షన్స్ పతాకంపై ప్రవీణ్ కుమార్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. 'దర్పణం' షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి రచయిత శివ శక్తిదత్తా, దర్శకులు శ్రీనివాస రెడ్డి, ఎన్ శంకర్, నటుడు కాదంబరి కిరణ్ కుమార్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు తొలి సన్నివేశానికి క్లాప్ నిచ్చారు. చిత్ర ప్రారంభోత్సవ అనంతరం నిర్మాత ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.'దర్పణం నా మొదటి చిత్రం. కథ ఎంతగానో నచ్చింది. మంచి ప్రేమ కథ. ప్రతి యువతీ యువకులు తమను కథలో చూసుకుంటారు. సింగిల్ షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నాం.' అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం - సిద్దార్థ్ సదాశివుని, సినిమాటోగ్రఫీ - సతీష్ ముత్యాల, స్టంట్స్ - మల్లేష్, ఎడిటర్ - ఈఎస్ ఈశ్వర్, సహ నిర్మాతలు - కేశవ్ దేశాయ్, క్రాంతి కిరణ్ వెల్లంకి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







