ట్రంప్ వైఖరిని నిరసిస్తూ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ కూడా రాజీనామా
- August 27, 2017
ట్రంప్ బృందాల రాజీనామాల లిస్ట్‌లో ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ కూడా చేరింది. జాతీయ భద్రతకు సంబంధించిన విషయాల్లో సైబర్ సెక్యూరిటీకి ట్రంప్ ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదని ఆరోపిస్తూ ఏడుగురు సభ్యుల బృందం రాజీనామా చేసింది. ఈ బృందంలో భారత సంతతికి చెందిన డాటా ఇంజనీరు కూడా ఉన్నారు. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వైజరీ కౌన్సిల్‌గా పిలిచే ఈ బృందం జాతీయ సైబర్ భద్రత గురించి నిర్వహణ లోపాల గురించి ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవైపు అమెరికా ప్రజలు ఆధారపడే వ్యవస్థల సైబర్ భద్రతకు ముప్పు పెరిగిపోతోందని, అటువంటి ప్రభావమే అధ్యక్ష ఎన్నికల్లో అగుపించిందని పేర్కొంది. దేశంలో జాతి విద్వేష హింసను అదుపు చేయడంలో ట్రంప్ విఫలం కావడం కూడా ఈ బృందం వైదొలగటానికి హేతువుగా పేర్కొంది. దీంతో పాటు శ్రామికుల తరపున అమెరికన్ సివిల్ వార్‌లో పోరాడిన జనరల్ రాబర్ట్ ఈ లీ విగ్రహ తొలగింపు ప్రతిపాదనను ఈ బృందం నిరసించింది. వీరి రాజీనామాకు ముందు ట్రంప్ బృందంలో మరో రెండు విభాగాలు రాజీనామా చేశాయి. అడ్మినిస్ట్రేషన్ డిసాల్వ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కౌన్సిల్, స్టాటజీ అండ్ పాలసీ ఫోరమ్‌లకు కూడా రాజీనామా చేశాయి.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









