పది నెలలుగా కోమాలో ఉన్న బాలీవుడ్‌ నటుడు నిర్మాత నీరజ్‌ వోరా

- August 27, 2017 , by Maagulf
పది నెలలుగా కోమాలో ఉన్న బాలీవుడ్‌ నటుడు నిర్మాత నీరజ్‌ వోరా

బాలీవుడ్‌ నటుడు, నిర్మాత నీరజ్‌ వోరా పది నెలలుగా కోమాలో ఉన్నారట. 2016 అక్టోబర్‌లో ఆయనకు గుండెపోటు వచ్చింది. దాంతో ఆయన్ని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చేరిన మరుసటి రోజే బ్రెయిన్‌ స్ట్రోక్‌ తగిలింది.
దాంతో ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. ఆయన త్వరగా కోలుకోవాలని నీరజ్‌ స్నేహితుడు ఫెరోజ్‌ ఇంట్లో ఓ గదిని ఐసీయూగా మార్చి అందులోనే చికిత్స చేయిస్తున్నట్లు నీరజ్‌ కుటుంబీకులు తెలిపారు. హిందీలో 'హెరాఫెరీ', 'చాచి 420' చిత్రాలకు నీరజ్‌ దర్శకత్వం వహించారు. ఇప్పుడిప్పుడే ఆయనలో కదలికలు వస్తున్నాయని పేర్కొన్నారు. నీరజ్‌ దర్శకత్వం వహిస్తున్న 'హెరాఫెరీ 3' సినిమా చిత్రీకరణ తాత్కాలికంగా నిలిచిపోయినట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com