భారతీయ నగరాల్లో ఉండే యూఏఈ పౌరులకు హెచ్చరిక
- August 28, 2017
న్యూఢిల్లీ: న్యూ ఢిల్లీలోని యుఎఇ దౌత్యకార్యాలయం భారతదేశంలో ఉండే ఎమిరాటీ పౌరులకు సలహా ఇచ్చింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రద్దీగా ఉన్న ప్రాంతాల నుంచి తమ దేశ పౌరులు దూరంగా ఉండాలని కోరింది. సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం డేరా బాబా అరెస్ట్ తర్వాత జరిగిన హింసాకాండలో కనీసం 36 మంది మరణించారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగదీప్ సింగ్ ఈ కేసులో తన తీర్పుని ఇస్తూ డేరా ముఖ్యఅధిపతి గుర్మీత్ రామ్ రహీం సింగ్ 2002 లో ఇద్దరు మహిళా శిష్యులను అత్యాచారం చేసి లైంగికంగా దోపిడీకి పాల్పడిన కేసులో నిందితుడు. ఈ వ్యక్తికి వందలాదిమంది అనుచరులు ఉన్నారు. వీరిలో 36 మంది బాధితులు, పంచకులలో 30 మంది మరణించారు,సిర్సా పట్టణంలో ఆరుగురు మరణించారు. ఇప్పటివరకు ఈ హింసాకాండలో దాదాపు 250 మందికి పైగా గాయపడ్డారు. జాతీయ రాజధానిలోని 11 నుంచి 13 పోలీసు జిల్లాల్లో హింసాసకాండను అణిచివేసేందుకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం నేషనల్ న్యూస్ చానెల్ నుండి ఆ ప్రాంతానికి వచ్చిన మీడియా బృందంపై సైతం దేరా సచ సౌద యొక్క అనుచరులు దాడి చేశారు..
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







