సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానున్న బాలయ్య నటించిన 'పైసా వసూల్'
- August 28, 2017
నందమూరి నటసింహం బాలకృష్ణ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో 'పైసా వసూల్' మూవీ అనౌన్స్ చేసినప్పుటినుంచే అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు.. ఇక స్టంపర్ రిలీజ్ అయ్యాక ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువయ్యాయి. రీసెంట్ గా వచ్చిన ధియేట్రికల్ ట్రైలర్ తో ఆ అంచనాలు మరింత పెరిగాయి. రిలీజ్ టైమ్ దగ్గరపడటంతో, సాంగ్స్ ప్రోమోలను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచింది చిత్ర యూనిట్. మరో మూడు రోజుల్లో పైసావసూల్ ధియేటర్లలో సందడి చేయనున్నది. హీరోని ఓ రేంజ్ లో మాస్ గా చూపించే పూరీ స్టైల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలకృష్ణ పెర్ఫార్మెన్సే హైలైట్ గా నిలవబోతుంది. శ్రియ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో కైరా దత్ స్పెషల్ సాంగ్ చేసింది.. రెగ్యులర్ ఫార్మాట్ లోనే ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు పూరీ జగన్నాథ్. ఇందులో బాలయ్య లుక్, బాడీ లాంగ్వేజ్, మానరిజమ్స్ కొత్తగా ఉండబోతున్నాయి.
పైసా వసూల్ పై అప్పటి వరకు ఉన్న అంచనాలను రీసెంట్ గా రిలీజ్ చేసిన ధియేట్రికల్ ట్రైలర్ రెట్టింపు చేసింది. అందులో బాలయ్య చెప్పిన డైలాగ్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఫ్యాన్స్ తో పాటు, మాస్ ఆడియన్స్ ని డైలాగ్స్ బాగా మెప్పిస్తున్నాయి. అలాగే ఒక్కొక్కటిగా రిలీజైన సాంగ్స్ ప్రోమోలు కూడా ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ను పెంచాయి.
ప్రీ రిలీజ్ బిజినెస్ లోనూ సత్తా చాటిన పైసా వసూల్, సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.. రిలీజ్ కి ముందే పాజిటివ్ బజ్ తెచ్చుకున్న పైసావసూల్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హడావిడి చేస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







