నేడు మన్మధుడు నాగ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు

- August 28, 2017 , by Maagulf
నేడు మన్మధుడు నాగ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు

అక్కినేని నాగేశ్వరరావు.. ఈ పేరుకు తెలుగు సినిమాకూ ఎంత అనుబంధం ఉందో అందరికీ తెలుసు. మరి ఆయన వారసుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయి. అక్కినేని నాగార్జున విషయంలో అలాగే భారీ అంచనాలు ఉన్నాయి. కానీ వాటిని అందుకోవడంలో విక్రమ్ తడబడ్డాడు. కొందరైతే.. అసలు నాగార్జున నటుడుగా పనికిరాడనే ఘాటైన కామెంట్స్ కూడా చేశాడు. కానీ విజ్ఞుడు విమర్శను స్వీకరిస్తే విజయం దాసోహం కాకతప్పదని నిరూపించి మూడు దశాబ్ధాలుగా తెలుగు సినిమా హిస్టరీలో ఇప్పటికీ నవమన్మథుడులా దూసుకుపోతోన్న అక్కినేని నాగార్జున పుట్టిన రోజు నేడు.. 
అక్కినేని నాగార్జున ..బోర్న్ విత్ సిల్వర్ స్క్రీన్.. నాగేశ్వరరావుగారి సినీ వారసుడిగా వెండితెర ప్రవేశం చేసిన హీరో. కెరీర్ మొదట్లో తడబడ్డా.. తర్వాత తండ్రికి తగ్గ తనయుడుగా నిరూపించుకున్న నటుడు. కొత్తదనాన్ని ప్రోత్సహించడంలో, కొత్తవారిని ఎంకరేజ్ చేయడంలో నాగ్ ఎప్పుడూ మొదట ఉంటారు.. ఇమేజ్ కు భిన్నమైన ప్రయోగాలు చేయడానికీ వెనకాడని స్టార్ హీరో నాగార్జున. 
హీరో అంటే పేజీల కొద్దీ డైలాగులు చెప్పడం.. ఇస్త్రీ నలక్కుండా పదిమందిని మడతబెట్టడం.. అదిరిపోయే స్టెప్పులేయడం అనే రొటీన్ ఫార్ములాకు చెక్ పెట్టాడు..నాగ్. సైకిల్ చైను లాగి కూడా కొట్టొచ్చని.. అరుపులు, కేకలు లేకుండా సైలెంట్ గా విలన్ ని బెదిరించవచ్చని శివతో నిరూపించాడు. తెలుగు సినిమా గమనాన్ని ఉలిక్కిపడేలా చేసి ఒక్క ఉదుటున పాతపద్ధతులన్నీ సర్ధుకునేలా చేసిన సినిమా...శివ. రామ్ గోపాల్ వర్మ అద్భుత సృష్టికి నాగార్జున పర్ఫార్మెన్స్ తోడై శివను ఎవర్ గ్రీన్ చేశాయి.. 
తెలుగులో నాగార్జున ఇమేజ్ కాస్త భిన్నం. క్లాస్ లో క్లాస్ గా మాస్ లో మాసివ్ గా కనిపిస్తాడు. వీటన్నిటికీ మించి ఏ సినిమా చేసినా అందులో తనదైన రొమాంటిక్ ట్యాగ్ ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాంటి నాగార్జున భక్తి సినిమాలో నటిస్తే.. ? అది కూడా రక్తి సినిమాలు తీసిన రాఘవేంద్రరావు దర్శకత్వంలో..?  అందుకే వీరి కాంబినేషన్ లో అన్నమయ్య అనౌన్స్ అయినప్పుడు అన్నీ విమర్శలే వచ్చాయి. అన్ని విమర్శలకు తన నటనతో సమాధానం చెప్పాడు నాగార్జున. అన్నమయ్యగా ఆ పాత్రకు ప్రాణం పోసి.. భక్తి పాత్రలు చేయడంలో తండ్రి ఎంతటి ఎక్స్ పర్టో తనలోనూ అంతటి ఎక్స్ పర్ట్ ఉన్నాడని నిరూపించుకున్నాడు.. అన్నమయ్య తర్వాత మళ్లీ అలాంటి సినిమా శ్రీరామదాసు సూపర్ హిట్. నాగార్జున నటనా హైలెట్.. అలాగే చాన్నాళ్ల తర్వాత తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. కాంబినేషన్ పరంగానూ ఆకట్టుకున్న రామదాసుకు ప్రేక్షకులు విజయరథం పట్టారు. తాజాగా రాజుగారి గది సీక్వెల్ లో నటిస్తున్నాడు నాగ్.. తొలిసారిగా హర్రర్ జోనర్ లో సినిమా చేస్తున్న నాగ్.. తన ఇద్దరు తనయులు చైతు, అఖిల్ తో పోటీగా ఇప్పటికీ యంగ్ హీరోలకు ధీటుగా ఉండే నవ మనన్మధుడు నాగ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలతో..
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com