టార్చ్ టవర్ అగ్ని ప్రమాదం: కారణమిదే
- August 30, 2017
దుబాయ్ మెరీనా టార్చ్ టవర్‌లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి కారణం తెలిసింది. పోలీసు అధికారులు ఆ ఘటనకు గల కారణాన్ని వెల్లడించారు. అప్పర్ ఫ్లోర్ నుంచి సిగరెట్‌ని ఆర్పకుండా కిందికి విసిరేయడంతో, అది కాస్తా భారీ అగ్ని ప్రమాదానికి కారణమయ్యిందని తెలిపారు పోలీసులు. దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి తెలిపిన వివరాలు ప్రకారం, పై ఫ్లోర్ నుంచి విసిరేసిన సిరగరెట్, కిందన బాల్కనీలో ఉన్న పాట్లో పడి, అది కాస్తా నిప్పుగా మారి, భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆగస్ట్ 4న ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎవరూ చనిపోయకపోయినా, 38 ఫ్లాట్లు మాత్రం డ్యామేజ్ అయ్యాయి. విచారణను 10 రోజుల్లో పూర్తి చేసినట్లు క్రిమినల్ ఎవిడెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఇబ్దిసామ్ అల్ అబ్దౌలి చెప్పారు. సిగరెట్ కారణంగా అగ్ని ప్రమాదం జరగడం ఇదే తొలిసారి కాదని, ఇటువంటి ఘటనలు గతంలో కూడా జరిగాయని పోలీసులు అంటున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







