చెల్లని ఎయిర్ టికెట్లను జారీ చేసి బంగ్లాదేశీ కార్మికులకు ట్రావెల్ ఏజెన్సీ కుచ్చుటోపీ
- August 30, 2017
అబుదాబి: పండుగ స్వదేశంలో జరుపుకొందామని ఓ బంగ్లాదేశీయుల కార్మిక బృందం విమాన టికెట్లను అబుదాబి ట్రావెల్ ఏజెన్సీ ద్వారా నమోదు చేసుకొన్నారు. వారంతా పెట్టె బేడాతో విమానాశ్రయానికి వచ్చి సంతోషంగా విమానం ఎక్కేందుకు సిద్ధమవుతుండగా ఆ విమాన టికెట్లు నకిలీవని ఎయిర్పోర్ట్ అధికారులు తేల్చిచెప్పడంతో వారంతా ఢీలా పడిపోయారు. ఇలా జరిగిందేమని ప్రశ్నించాలని టికెట్లు నమోదు చేసిన ఏజెంట్ వద్దకు వస్తే ఆ ట్రావెల్ ఏజెన్సీ తన కార్యాలయాన్ని మూసివేసిందని లబోదిబోమంటున్నారు. అబుదాబి లోని ముస్సాహ్ పారిశ్రామిక ప్రాంతంలో నివసించే కార్మికుల బృందం తమ ఇళ్లకు వెళ్లి ఈద్ ఆల్ అడా పండుగ కుటుంబాలతో జరుపుకుందామని ప్రణాళిక సిద్ధం చేసుకొన్నారు. అయితే వారికి నకిలీ టికెట్లు ఆ ట్రావెల్ ఏజెన్సీ అంటగట్టడంతో జరిగిన మోసానికి బిక్కమొఖాలతో విమానాశ్రయంలోనే కాలు కాలిన పిల్లుల మాదిరిగా తిరుగుతున్నారు. బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ కు చెందిన ఎస్కాందూర్ హుస్సేన్ ఆలీ (28) స్థానికంగా ఒక అల్యూమినియం ఫ్యాబ్రికేటర్ గా పనిచేస్తుంటాడు.తన 10 నెలల వయసున్న కుమార్తెను మొదటి సారి చూసేందుకు ఎంతో ఉబలాటపడ్డాడు. తన చిన్నారిని కలవడానికి గంటలను సైతం లెక్కించారు. అయితే, ఆగస్టు 25 న ఉదయం 11.30 గంటలకు బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానంలో చేరడానికి అబుదాబి విమానాశ్రయంలో చేరినప్పుడు, అతను తన టికెట్ చెల్లని వైమానిక అధికారుల నుండి సమాధానం రావడంతో ఆశ్చర్యపోయాడు. ఇలా ఎందరో బంగ్లాదేశ్ కార్మికులు తమ దురదృష్టానికి తమను తామే నిందించుకొంటున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







