భారత దేశవ్యాప్తంగా 'ఇ-సహయోగ్', 'పాన్ క్యాంప్స్'
- October 27, 2015
ఆదాయపు పన్ను శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇ-సహయోగ్', 'పాన్ క్యాంప్స్' కార్యక్రమాలను మంగళవారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించనున్నారు. పన్ను చెల్లింపుదారులతో ఇ-మెయిల్ ద్వారా సంప్రదింపులు జరిపే 'ఇ-సహయోగ్' సేవలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ సేవలను తాత్కాలికంగా పరీక్షించగా, ఇకపై పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. మరింత మందిని శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) పరిధిలోకి తీసుకొచ్చేందుకు దేశవ్యాప్తంగా పాన్ క్యాంపులను నిర్వహించాలని ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 23 కోట్ల మంది మాత్రమే శాశ్వత ఖాతా సంఖ్యను కలిగి ఉన్నారు. సాధ్యమైనంత ఎక్కువ మంది పాన్ పరిధిలోకి వస్తే బడ్జెట్‌లో ప్రతిపాదించినట్లు రూ.లక్షపై కొనుగోలు, అమ్మకాలకు పాన్ సంఖ్యను తప్పనిసరి చేసే వెసులు బాటు ప్రభుత్వానికి లభిస్తుంది. దీంతో పాన్ క్యాంప్స్‌ను మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- భారీ వర్షాలు..అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు!
- హైదరాబాద్ విమానాశ్రయం–బ్రస్సెల్స్ విమానాశ్రయం మధ్య అవగాహన ఒప్పందం
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో వైట్ కోట్ సెరిమనీ
- ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. పలు విమానాల దారి మళ్లింపు
- మారిషస్‌లో డా.గజల్ శ్రీనివాస్‌కు ‘విశ్వ సంగీత శాంతి దూత’ పురస్కారం
- ఇరాన్ 60 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన..హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభానికి ‘రోడ్‌మ్యాప్’
- మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు పేర్లు ఖరారు?
- అమెరికాలో ల్యాండైన జిన్‌పింగ్
- రోడ్డుపై చీపురు పట్టిన పోలీస్ అధికారి.. వీడియో వైరల్..!!
- ఏఐ వినియోగంలో సైబర్ భద్రతపై చర్చించిన నిపుణులు..!!







