జమ్మూ కశ్మీర్ డీఐజీని కదిలించిన జోరా హృదయ వేదన
- August 30, 2017
చిన్న బిడ్డ నిబ్బరంగా ఎలా ఉండగలదు... నాన్న ఒడిలో ఆడుకునే పసిబిడ్డ నాన్న లేకపోతే ఎలా ఉండగలదు..అమ్మ అన్నం పెడుతుంది.. నాన్న ఆడిస్తాడు.. నాన్న లేని తన ప్రపంచాన్ని ఊహించుకుని భోరున విలపించిందా చిట్టి తల్లి... ఆ బంగారు తల్లిని చూస్తే గుండె బరువెక్కిపోతుంది.. తండ్రి దేశం కోసం ప్రాణాలర్పించాడు...బిడ్డను అనాధను చేశాడు. తన నాన్నలేడని, ఇక రాడని శ్రీనగర్ ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన అబ్దుల్ రషీద్ కుమార్తె జోరా రోదన ఆ తండ్రికి వినిపించే ఉంటుంది.
జోరా హృదయ వేదన జమ్మూ కశ్మీర్ డీఐజీని కదిలించింది. నువ్వు అంతగా ఏడుస్తుంటే నా గుండె పిండేసినట్లుంది తల్లీ అంటూ తన బాధను ఫేస్‌బుక్ ద్వారా జోరాకి తెలియజేశారు. ఏం జరిగిందో తెలుసుకునే వయసు కూడా జోరాకి లేదు. తనని ఎలా ఓదార్చాలో కూడా తెలియట్లేదు అని డీఐజ్ అన్నారు. ఎందరో పోలీసులు కుటుంబానికి, కన్నబిడ్డలకు దూరమై దేశం కోసం ప్రాణాలర్పిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే ఇలాంటి విషయాలే మమ్మల్ని చరిత్రలో గుర్తుండిపోయేలా చేస్తాయని, ఖాకీ దుస్తులు వేసుకున్నప్పుడు దేశానికి చేసిన ప్రతిజ్ఞ మమ్మల్ని వెనకడుగు వేయనీయదని అన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







